హైదరాబాద్: తెలంగాణ స్కూళ్లు కాలేజీల బంద్ ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆసక్తి నెలకొంది. జూలై 10న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు మూసివేయాలని పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ఈ నెల 10వ తేదీన విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో AISF, SFI, PDSU, AIDSO, AIFDS, AISB, AIPSU విద్యార్థి సంఘాల నాయకులు బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10న జరగబోయే విద్యాసంస్థల బంద్‌కు ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల యాజమాన్యాలు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, పెండింగ్ ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌తో రేపు కూడా కాలేజీల బంద్ చేపట్టనున్నట్లు బీసీ జేఏసీ (BC JAC) ఒక ప్రకటనలో తెలిపింది.
Read Warangal News and Latest Politics News and Real Estate

