Board of Secondary Education Telangana నుంచి కీలక ప్రకటన వెలువడింది. తెలంగాణలో పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 29న విడుదల కావడంతో, విద్యార్థుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.
ఒకవైపు ఉత్తీర్ణులైన వారు ఆనందంలో మునిగితేలుతుండగా, మరోవైపు ఫెయిల్ అయిన వారు నిరాశలో ఉన్నారు. అయితే అలాంటి విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సప్లిమెంటరీ పరీక్షల ద్వారా మళ్లీ అవకాశం లభిస్తోంది.
ఫలితాల సమగ్ర వివరాలు:-
ఈ ఏడాది మొత్తం 5,26,166 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 4,91,774 మంది ఉత్తీర్ణులయ్యారు.
సుమారు 5,538 మంది విద్యార్థులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు.
అదే సమయంలో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసుకునే అవకాశం కూడా ఉంది.
ఫీజు చెల్లింపు తేదీలు :-
సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలనుకునే విద్యార్థులు ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు తమ స్కూల్ హెడ్‌మాస్టర్ ద్వారా ఫీజు చెల్లించాలి. ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే అప్లై చేయడం మంచిది.
రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్
రీకౌంటింగ్: సబ్జెక్టుకు ₹500
రీవెరిఫికేషన్: సబ్జెక్టుకు ₹1000 చొప్పున అప్లై చేసుకునే అవకాశం ఉంది.
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ (జూన్ 2026)
సమయం: ఉదయం 9:30 – మధ్యాహ్నం 12:30
జూన్ 5: ఫస్ట్ లాంగ్వేజ్
జూన్ 6: సెకండ్ లాంగ్వేజ్
జూన్ 7: థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
జూన్ 8: మ్యాథమెటిక్స్
జూన్ 9: ఫిజికల్ సైన్స్
జూన్ 10: బయోలాజికల్ సైన్స్
జూన్ 11: సోషల్ స్టడీస్
జూన్ 12: OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2
ఎలా సిద్ధమవ్వాలి?
సప్లిమెంటరీ పరీక్షలు ఒక సెకండ్ ఛాన్స్ లాంటివి. కాబట్టి
• ఫెయిల్ అయిన సబ్జెక్టులపై ఫోకస్ పెట్టాలి.
• గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయాలి.
• టీచర్ల సలహాలు తీసుకోవాలి.
• రోజుకు కనీసం కొన్ని గంటలు చదువుకు కేటాయించాలి.
సప్లిమెంటరీ పరీక్షలను ఒక అవకాశంగా తీసుకుని, సరైన ప్లానింగ్‌తో చదివితే ఈసారి మంచి ఫలితాలు సాధించడం ఖాయం. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యంగా ముందుకు సాగాలని అధికారులు సూచిస్తున్నారు.


