HomeWarangal Newsవరంగల్ జోనల్ కార్యాలయంలో ఉన్నతాధికారిపై దాడి.. టీజీ ట్రాన్స్‌కో కన్‌స్ట్రక్షన్ డీఈ సంపతి రావుపై వేటు

వరంగల్ జోనల్ కార్యాలయంలో ఉన్నతాధికారిపై దాడి.. టీజీ ట్రాన్స్‌కో కన్‌స్ట్రక్షన్ డీఈ సంపతి రావుపై వేటు

Published on

spot_img

వరంగల్: తెలంగాణ స్టేట్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ వరంగల్ జోన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న కన్‌స్ట్రక్షన్ విభాగం డివిజనల్ ఇంజనీర్ ఎల్. సంపతి రావుపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. కార్యాలయ నిబంధనలను ఉల్లంఘించి క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడిన కారణంగా ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

వరంగల్ జోనల్ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న చీఫ్ ఇంజనీర్ పట్ల డీఈ సంపతి రావు అనుచితంగా ప్రవర్తించడంతో పాటు దౌర్జన్యం చేసి, బెదిరింపులకు దిగి, భౌతిక దాడికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఈ చర్యలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సంస్థలో క్రమశిక్షణను కాపాడే క్రమంలో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన టీజీ ట్రాన్స్‌కో యాజమాన్యం, ఫైనాన్స్, కమర్షియల్ మరియు హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ ఓరుగంటి శ్రీనివాస్ ఆదేశాల మేరకు తక్షణమే సస్పెన్షన్ ఉత్తర్వులు అమలులోకి తెచ్చింది.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles