తెలంగాణలో 7,437 పోలీసు ఉద్యోగాలు.. TGPLRB భారీ నోటిఫికేషన్ విడుదల:
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త అందింది. రాష్ట్రంలో మొత్తం 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TGPLRB) అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి బోర్డు ఒకేసారి నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది.
నాలుగు విభాగాల్లో నియామకాలు:
పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, జైలు శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి:
ఎస్సై (సివిల్) – 148
కానిస్టేబుల్ (సివిల్) – 3,697
కానిస్టేబుల్ (ఏఆర్) – 1,052
SPF కానిస్టేబుల్ – 1,380
SPF ఎస్సై – 44
ఫైర్ ఫైటర్స్ – 751
అభ్యర్థులు అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు తేదీలు తదితర పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్ https://www.tgprb.in/లో తెలుసుకోవచ్చు
ఉద్యోగార్థుల్లో ఆనందం:
పోలీసు ఉద్యోగాల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ ప్రకటనతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ సంఖ్యలో పోస్టులు ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా పోటీ నెలకొనే అవకాశముంది. ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే పరీక్షలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. పోలీసు నియామకాల్లో రాత పరీక్షతో పాటు శారీరక దారుఢ్య పరీక్షలకు కూడా ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు విద్యా పరమైన సన్నద్ధతతో పాటు ఫిజికల్ ఫిట్నెస్పైనా దృష్టి పెట్టడం అవసరం. ఈ భారీ నియామక ప్రక్రియ ద్వారా వేలాది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం లభించనుంది.


