‘నందుస్ వరల్డ్’ యూట్యూబ్ ఛానల్‌తో గుర్తింపు తెచ్చుకున్న రామ నందన అలియాస్ నందు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ముఖ్యంగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభమైన వెంటనే ఆమె హఠాత్తుగా భారత్‌కు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన కొద్దిసేపటికే పోలీసుల అదుపులోకి వెళ్లడం చర్చకు దారితీసింది. అసలు నందు ఇంత సడెన్‌గా ఇండియాకు ఎందుకు వచ్చారు? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కోసమేనా? అనే ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ప్రచారం :
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6న ప్రారంభమైంది. ఈ సీజన్‌లో 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి వెళ్లారు. ఇదే సమయంలో రానున్న వారాల్లో కొందరు వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు ఉండొచ్చనే ప్రచారం మొదలైంది. ఈ జాబితాలో నందు పేరు కూడా వినిపించింది. ఆమెను వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా తీసుకునే అవకాశం ఉందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.
అయితే బిగ్‌బాస్ నిర్వాహకులు మాత్రం నందు ఎంట్రీపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆమె హైదరాబాద్‌కు రావడానికి కారణం బిగ్‌బాస్ షోనే అని ప్రచారం జరుగుతుంది.
ఇంత హంగామా ఎందుకు? :
నందు పేరు బిగ్‌బాస్‌తో ముడిపడటానికి ప్రధాన కారణం ఆమెకు ఇప్పటికే ఉన్న సోషల్ మీడియా క్రేజ్. ఆమె భారత్‌కు తిరిగి రావడం, అది కూడా బిగ్‌బాస్ సీజన్ ప్రారంభమైన వెంటనే జరగడం అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. ఇదే సమయంలో ఆమెపై ఉన్న కేసులు, లుకౌట్ సర్క్యులర్ కారణంగా హైదరాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామం వైల్డ్‌కార్డ్ ప్రచారానికి మరింత హైప్ తెచ్చింది.
పోలీస్ స్టేషన్ వద్ద మీడియాకు ముఖం చూపించలేదా? :
విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న తర్వాత నందనను సంబంధిత పోలీసులకు అప్పగించారు. ఈ సమయంలో ఆమె మీడియా కెమెరాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించారు. ముఖాన్ని కప్పుకుని కనిపించిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఆమె మీడియాకు ముఖం ఎందుకు చూపించలేదన్న దానిపై ఇప్పుడు ఎక్కువ ప్ర్శ్నలు వినిపిస్తున్నాయి.
మరి అసలు నిజమేంటి? :
నందు భారత్‌కు వచ్చిన అసలు కారణం ఏమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మిగిలిపోయింది. బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్ కోసం వచ్చిందనే ప్రచారం బలంగా ఉన్నప్పటికీ, అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు. పైగా ఆమెపై కొనసాగుతున్న న్యాయపరమైన వ్యవహారాలు కూడా బిగ్‌బాస్ ఎంట్రీకి అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
అందుకే “బిగ్‌బాస్ కోసం నందు ఇండియాకు వచ్చింది” అని ఖచ్చితంగా చెప్పడం కంటే.. “బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కోసమే వచ్చిందనే ప్రచారం జరుగుతోంది” అని చెప్పడం ప్రస్తుత పరిస్థితుల్లో సరైనది. చివరికి నందు నిజంగానే బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెడుతుందా..? లేదా..? అన్నది షో నిర్వాహకుల అధికారిక ప్రకటన తర్వాతే తేలనుంది..!


