తెలంగాణ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే (PMJ) జ్యువెలరీ దోపిడీ కేసులో కీలక పురోగతి లభించింది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితులను బీహార్ మరియు బెంగాల్ రాష్ట్రాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన 161 తులాల బంగారాన్ని పోలీసులు రికవరీ చేసినట్లు సమాచారం.
బీహార్‌కు చెందిన ‘ది గోల్డెన్ థీఫ్’ సుబోధ్ సింగ్ ఈ భారీ దోపిడీకి మాస్టర్ మైండ్‌గా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన వారితో పాటు మరో 10 మంది నిందితులు ఇంకా పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.


