HomeLatest Newsతెలంగాణ బడిబాట 2026: తేదీలు, షెడ్యూల్, పూర్తి వివరాలు

తెలంగాణ బడిబాట 2026: తేదీలు, షెడ్యూల్, పూర్తి వివరాలు

Published on

spot_img

2026-27 విద్యాసంవత్సరానికి గాను ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని మే 14 నుండి జూన్ 19 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు, ప్రతి చిన్నారికి విద్యాహక్కును కల్పించేందుకు తెలంగాణ విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

బడిబాట ప్రధాన ఉద్దేశ్యం:

​బడి ఈడు పిల్లలందరినీ గుర్తించి, వారిని సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

ముఖ్యంగా అంగన్‌వాడీ పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లోకి, ప్రాథమిక పాఠశాల పూర్తి చేసిన వారిని ఉన్నత పాఠశాలల్లోకి (సాఫీ మార్పిడి) చేర్చేలా ప్రణాళికలు రూపొందించారు.

షెడ్యూల్ విశేషాలు:

  • ​మే 14న ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం జూన్ 19 వరకు వివిధ దశల్లో సాగుతుంది
  • మే 14: తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం (PTM).
  • మే 21 – జూన్ 3: మాతృ కమిటీలు, యువజన సంఘాలు, గ్రామ సభలతో సమావేశాలు.
  • జూన్ 4: భారీ అవగాహన ర్యాలీ.
  • ​జూన్ 8 – 10: ఉపాధ్యాయుల ఇంటింటి ప్రచారం (Door to Door Campaign).
  • జూన్ 12: వెల్కమ్ డే / అమ్మ మాట – పాఠశాల బాట.
  • జూన్ 15: సామూహిక అక్షరాభ్యాసం.
  • జూన్ 16 నుండి 19 వరకు డిజిటల్ అవేర్నెస్, స్పోర్ట్స్ డే వంటి ప్రత్యేక కార్యక్రమాలు.

ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతల ప్రచారం:

​ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక మౌలిక వసతులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

​• కృత్రిమ మేధస్సు (AI) ద్వారా బోధన.

• స్మార్ట్ క్లాస్ రూమ్‌లు మరియు డిజిటల్ లిటరసీ.

​• పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానంపై ప్రత్యేక దృష్టి.

ఉపాధ్యాయులకు కీలక బాధ్యతలు:

​గత సంవత్సరంతో పోలిస్తే ప్రవేశాలను కనీసం 10 శాతం పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డ్రాపౌట్స్ (బడి మానేసిన వారు), ప్రత్యేక అవసరాలు గల పిల్లల (CwSN) గుర్తింపుపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పూర్వ విద్యార్థులను (Alumni) స్కూల్ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోవాలని సూచించింది.

ప్రోత్సాహకాలు:

​ఈ బడిబాట కార్యక్రమంలో అద్భుత ప్రతిభ కనబరిచి, అత్యధిక నమోదు సాధించిన 3 జిల్లాలు మరియు 10 పాఠశాలలను ప్రభుత్వం ప్రత్యేకంగా సత్కరించనుంది.

తెలంగాణ బడిబాట 2026 ఎప్పుడు ప్రారంభమవుతుంది?

తెలంగాణ బడిబాట 2026 కార్యక్రమం మే 14 నుంచి జూన్ 19 వరకు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడం, బడి ఈడు పిల్లలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.

FAQ’s

తెలంగాణ బడిబాట 2026 ఎప్పుడు ప్రారంభమవుతుంది?

తెలంగాణ బడిబాట 2026 కార్యక్రమం మే 14 నుంచి ప్రారంభమై జూన్ 19 వరకు నిర్వహించనున్నారు.

తెలంగాణ బడిబాట 2026 ప్రధాన లక్ష్యం ఏమిటి?

బడి ఈడు పిల్లలను గుర్తించి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం, విద్యార్థుల నమోదును పెంచడం ప్రధాన లక్ష్యాలు.

బడిబాట 2026లో ఇంటింటి ప్రచారం ఎప్పుడు జరుగుతుంది?

జూన్ 8 నుంచి 10 వరకు ఉపాధ్యాయుల ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు.

బడిబాట 2026లో ఏ అంశాలపై దృష్టి పెడుతున్నారు?

విద్యార్థుల నమోదు పెంపు, డ్రాపౌట్స్ గుర్తింపు, ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు, ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతల ప్రచారంపై దృష్టి పెట్టనున్నారు.

Latest articles

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు కీలక సూచనలు వెలువడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో భారీగా వేడుకలు నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు

అర్హత లేని టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అర్హతలు లేని టీచర్ల నియామకాలు, కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.
spot_img

Related Articles