2026-27 విద్యా సంవత్సరం నుండి స్కాలర్‌షిప్ మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అడ్మిషన్ల సమయంలో కళాశాలలు విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు వేసిన తర్వాత, విద్యార్థులే ఆ మొత్తాన్ని కళాశాలలకు చెల్లించాల్సి ఉంటుంది. నిధులు కేవలం విద్యార్థి పేరు మీద ఉండి, ఆధార్‌తో సీడింగ్ అయిన బ్యాంక్ ఖాతాల్లోకి మాత్రమే జమ చేయబడతాయి.
విద్యార్థులకు సరైన హాజరు శాతం ఉంటేనే ప్రభుత్వం ఈ ఫీజులను చెల్లిస్తుంది.


