లాసెట్, పీజీఎల్‌సెట్-2026 ఫలితాలు విడుదల.. మీ ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి..!
తెలంగాణ రాష్ట్రంలో న్యాయ విద్యlO ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్ (LAWCET), పీజీఎల్‌సెట్ (PGLCET)-2026 పరీక్షల ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలు మరియు ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్సైట్ https://lawcet.tgche.ac.in/ ద్వారా పరిశీలించుకోవచ్చు. ఫలితాల ప్రకటనతో అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది.
ఈ ఏడాది నిర్వహించిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేసి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల ఆధారంగా అభ్యర్థుల మెరిట్ జాబితాను సిద్ధం చేసి తదుపరి ప్రవేశ ప్రక్రియలు చేపట్టనున్నారు.
ఫలితాల విడుదల అనంతరం త్వరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా వెబ్ ఆప్షన్లు, సర్టిఫికెట్ వెరిఫికేషన్, సీట్ల కేటాయింపు వంటి దశలను అధికారులు అమలు చేయనున్నారు. అభ్యర్థుల అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.
లాసెట్, పీజీఎల్‌సెట్ ర్యాంకుల ఆధారంగా తెలంగాణలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు లా కళాశాలలో ప్రవేశాలు కల్పించనున్నారు. అందువల్ల అభ్యర్థులు తమ ర్యాంకులు కౌన్సెలింగ్ తేదీలు, అవసరమైన ధృవపత్రాల వివరాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. న్యాయవిద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఈ ఫలితాలు కీలక మైలురాయిగా నిలవనున్నాయి.


