తెలంగాణ రాష్ట్రంలోని బీపీఈడీ (Bachelor of Physical Education), యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG PECET) హాల్‌టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ విషయాన్ని పరీక్ష కన్వీనర్ ప్రొఫెసర్ రాజేష్ కుమార్ వెల్లడించారు.
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, జన్మ తేదీ వంటి వివరాలను నమోదు చేసి హాల్ టికెట్ ను సులభంగా పొందవచ్చు . హాల్ టికెట్ లో అభ్యర్థి పేరు, పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రం వంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి అని అధికారులు తెలిపారు.

పరీక్షకు హాజరయ్యే ముందు హాల్ టికెట్ లోని వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్ తో పాటు సరైన గుర్తింపు కార్డు కూడా తీసుకురావడం తప్పనిసరి అని అధికారులు పేర్కొన్నారు. హాల్ టికెట్ లేకుండా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అలాగే పరీక్ష సమయానికి ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని పరీక్షా నియమాలను కచ్చితంగా పాటించాలని అభ్యర్థులకు సూచించారు. తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషనల్ సెట్ కు సంబంధించిన పూర్తి సమాచారం పరీక్ష షెడ్యూల్ మరియు ఇతర మార్గదర్శకాలను అధికారిక వెబ్సైట్లో పరిశీలించవచ్చని కన్వీనర్ తెలిపారు. ఈ హాల్‌టికెట్లను https://pecet.tgche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించి డౌన్లోడ్ చేసుకోవాలని కన్వీనర్ ప్రొఫెసర్ రాజేష్‌కుమార్ తెలిపారు.


