హన్మకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (TNPDCL) పరిధిలో మే 1వ తేదీ నుండి వారం రోజుల పాటు ‘విద్యుత్ భద్రతా వారోత్సవాలు’ నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు. విద్యుత్ ప్రమాదాల నివారణ మరియు వినియోగదారులలో అవగాహన పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
మే 1 నుండి వారం రోజుల పాటు టీఎన్‌పీడీసీఎల్ పరిధిలోని మొత్తం 18 సర్కిళ్లలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సర్కిల్‌కు ఒక నోడల్ అధికారిని నియమించడం జరిగింది.
సంస్థ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజలతో సమావేశాలు నిర్వహించాలని సీఎండీ ఆదేశించారు. ముఖ్యంగా వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో విద్యుత్ లైన్ల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిప్రమాదాల నివారణ మరియు సురక్షితమైన విద్యుత్ వినియోగంపై ఈ వారోత్సవాల్లో ప్రత్యేక దృష్టి సారించనున్నారు.


