తమిళనాడు రాజధాని చెన్నైలో తీవ్ర ఉద్రిక్తత, హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తమిళనాడు సీఎం విజయ్, ప్రముఖ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తంజావూరు పోలీస్ స్టేషన్లో ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌పై 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
దీంతో ఆయనను అదుపులోకి తీసుకోవడానికి టీవీకే కార్యకర్తలు ఉదయనిధి నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో డీఎంకే, టీవీకే కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు రంగంలోకి దిగి ఉదయనిధిని అరెస్ట్ చేశారు.
ఆయనను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా డీఎంకే శ్రేణులు పోలీసు వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపాయి. ప్రస్తుతం అతడిని తంజావూరుకు తీసుకువెళ్లినట్లు సమాచారం.
మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్
మరోవైపు, ఈ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఉదయనిధి తరఫు న్యాయవాదులు ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసర విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించింది.
నా అరెస్ట్.. ఒక జోక్: మాజీ డిప్యూటీ సీఎం
చెన్నైలోని నీలంగరైలోని తన నివాసం నుంచి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తుండగా ఉదయనిధి మీడియాతో మాట్లాడారు. తన అరెస్ట్ ఒక జోక్ అని, తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని అన్నారు. తాను తప్పు చేశానా లేదా అనేది న్యాయస్థానమే తేలుస్తుందని, తాను ఎవరి పేరూ ప్రస్తావించలేదని, న్యాయపరంగానే ఈ అంశాన్ని ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


