ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 19న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించనున్న శ్రీ పరాభవ నామ ఉగాది సంవత్సరం వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు.
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, సహచర మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మరియు వేద పండితులతో కలిసి ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని కూడా వేడుకలకు ఆహ్వానించారు. ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.


