JRF ఉద్యోగాలు: పీజీ పూర్తి చేసిన అభ్యర్థులకు హైదరాబాద్ విశ్వవిద్యాలయం (University of Hyderabad) శుభవార్త అందించింది. యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌కు చెందిన సిస్టమ్స్ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ విభాగంలో జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.37,000 ఫెలోషిప్తో పాటు 27 శాతం హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) అందించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
అర్హతలు, నైపుణ్యాలు ఇవే:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) పూర్తి చేసి ఉండాలి. అలాగే కంప్యూటేషనల్ స్కిల్స్, ప్రోగ్రామింగ్, లినక్స్, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అంశాల్లో పరిజ్ఞానం లేదా అనుభవం ఉంటే అదనపు ప్రాధాన్యత లభిస్తుంది. పరిశోధన లేదా పరిశ్రమలో అనుభవం ఉన్న వారికి ఎంపికలో మెరుగైన అవకాశాలు ఉండనున్నాయి.
వయోపరిమితి, ఎంపిక విధానం:
సాధారణ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 28 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు మరియు మహిళలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదేళ్ల వరకు వయో సడలింపు వర్తిస్తుంది. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహించబడుతుంది.
దరఖాస్తు విధానం, చివరి తేదీ:
దరఖాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే స్వీకరిస్తారు. పూర్తి చేసిన దరఖాస్తులను డాక్టర్. మంజరి కిరణ్, రూమ్ నెం. F758, డిపార్ట్మెంట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, గచ్చిబౌలి, హైదరాబాద్ – 500046 చిరునామాకు పంపాలి. దరఖాస్తులు సమర్పించడానికి ఆగస్టు 17, 2026 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం హైదరాబాద్ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ https://uohyd.ac.in ను సందర్శించవచ్చు.


