HomeLatest Newsఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

Published on

spot_img

డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూపీఐ (ఊఫీ) వినియోగదారులకు కీలక సమాచారం. యూపీఐ లావాదేవీలపై కొత్తగా ఛార్జీలు విధించే నిర్ణయం తీసుకున్నింది ప్రభుత్వం. ఈ కొత్త ఛార్జీలు వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం. అయితే వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలకు మాత్రం ఎలాంటి ఫీజు ఉండదని పేర్కొంది.

రూ.2 వేల దాటితే 0.4 శాతం ఛార్జ్ :

కొత్త విధానం ప్రకారం రూ.2 వేల కంటే ఎక్కువ విలువైన కొన్ని యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం చొప్పున ఛార్జ్ విధించనున్నట్లు తెలుస్తుంది. దీనిని మర్చంట్ డిస్కౌంట్ రేట్ గా పేర్కొన్నారు. రూ.75 వేల నుంచి రూ.1 లక్ష వరకు జరిగే లావాదేవీలకు గరిష్ఠంగా రూ.300 వరకు ఛార్జ్ ఉండనున్నాయి.

అదే సమయంలో రూ.2 వేల లోపు జరిగే లావాదేవీలకు ఈ ఛార్జీలు వర్తించవు. వ్యక్తుల మధ్య జరిగే పర్సన్-టు-పర్సన్ చెల్లింపులు కూడా ఉచితంగానే కొనసాగనున్నట్లు సమాచారం.

కొన్ని రంగాలకు ప్రత్యేక ఫీజు :

రైలు టికెట్లు, టెలికాం, ఇంధనం వంటి కొన్ని విభాగాలకు సంబంధించిన యూపీఐ చెల్లింపులపై రూ.5 ఫిక్స్‌డ్ ఛార్జ్ విధించనున్నారు. చిన్న వ్యాపారులకు కూడా కొంత మినహాయింపు ఇవ్వనున్నారు. నెలకు రూ.1 లక్షలోపు యూపీఐ లావాదేవీలు నిర్వహించే చిన్న వ్యాపారులకు ఈ ఛార్జీలు వర్తించవని సమాచారం.

95 శాతం లావాదేవీలు రూ.2 వేల లోపే :

యూపీఐ ద్వారా జరిగే లావాదేవీల్లో అత్యధిక భాగం రూ.2 వేల కంటే తక్కువ విలువ కలిగినవేనని తెలుస్తుంది. ఒక అంచనా ప్రకారం రూ.29.9 లక్షల కోట్ల విలువైన 2,451 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటిలో 95 శాతానికి పైగా లావాదేవీలు రూ.2 వేల లోపే ఉన్నట్లు నివేదికలు తెలిపాయి. దీంతో కొత్త ఛార్జీల ప్రభావం ప్రధానంగా అధిక విలువైన వ్యాపార లావాదేవీలపైనే ఉండే అవకాశం ఉంది.

ఎంత మొత్తానికి ఎంత ఛార్జీ?

ప్రతిపాదిత ఛార్జీల ప్రకారం, లావాదేవీ మొత్తాన్ని బట్టి ఫీజు ఈ విధంగా ఉండొచ్చు:

  • రూ.3,000 లావాదేవీకి రూ.12
  • రూ.50,000 లావాదేవీకి రూ.200
  • రూ.75,000 లావాదేవీకి రూ.300
  • రూ.1,00,000 లావాదేవీకి రూ.300

అయితే ప్రతి యూపీఐ లావాదేవీపైనా ఛార్జీ విధించరు. నిర్ణయించిన పరిమితిని దాటిన లావాదేవీలకు మాత్రమే ఈ ఫీజులు వర్తించేలా నిబంధనలు ఉంటాయి.

చిన్న వ్యాపారులపై ప్రభావం తక్కువగా ఉండేలా :

కొత్త విధానంలో చిన్న వ్యాపారులకు మినహాయింపులు కల్పించడం ద్వారా వారిపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే అధిక మొత్తాల్లో డిజిటల్ చెల్లింపులు చేసే వ్యాపారులు మాత్రం కొత్త ఛార్జీలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల 15 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.

Latest articles

NH-563పై అండర్‌పాస్‌ కోసం నిరసన.. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామస్థుల డిమాండ్

ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం వద్ద NH-563పై అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, రైతులు, యువకులు రాస్తారోకో చేపట్టారు.

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కీలక విచారణ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే జరగాలని స్పష్టం చేస్తూ, ఈసీఐ, కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
spot_img

Related Articles

NH-563పై అండర్‌పాస్‌ కోసం నిరసన.. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామస్థుల డిమాండ్

ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం వద్ద NH-563పై అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, రైతులు, యువకులు రాస్తారోకో చేపట్టారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కీలక విచారణ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే జరగాలని స్పష్టం చేస్తూ, ఈసీఐ, కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.