HomeLatest Newsవైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. నంబర్ 3 వెనుక ఇంత కథ ఉందా?

వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. నంబర్ 3 వెనుక ఇంత కథ ఉందా?

Published on

spot_img

వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. నంబర్ 3 వెనుక ఇంత కథ ఉందా? :

భారత దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ 2026 సీజన్ ప్రారంభమైంది. ఈస్ట్ జోన్ తరఫున వైస్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ జెర్సీ ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణమైంది. జెర్సీ వెనుక ఉన్న నంబర్‌లో కొంత భాగాన్ని టేప్‌తో కప్పి ఉంచడం మ్యాచ్ సందర్భంగా కనిపించింది.

జెర్సీపై టేప్ ఎందుకు? :

నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ కేవలం 8 పరుగులకే ఔటయ్యాడు. అయితే అతడి జెర్సీపై ఉన్న టేప్ వ్యవహారమే ఎక్కువగా చర్చనీయాంశమైంది. ఈస్ట్ జోన్ లాజిస్టిక్స్ విభాగం వైభవ్ కోరుకున్న నంబర్‌తో కూడిన జెర్సీని సకాలంలో అందించలేకపోయింది. దీంతో మరో నంబర్ ఉన్న జెర్సీని తీసుకున్న అతడు, తనకు ఇష్టమైన 3వ నంబర్ మాత్రమే కనిపించేలా మిగతా భాగాన్ని టేప్‌తో కప్పేశాడు.

నంబర్ 3 వెనుక సెంటిమెంట్ :

వైభవ్‌కు 3వ నంబర్ జెర్సీపై ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడినప్పటి నుంచి భారత జట్టుకు అరంగేట్రం చేసిన సందర్భంలోనూ ఇదే నంబర్‌ను ఉపయోగించాడు.

తల్లి సూచనతోనే ఎంపిక :

అండర్-19 ఆసియా కప్ 2025 సమయంలో తన తల్లి ఇచ్చిన సలహాతో నంబర్ 3ను ఎంచుకున్నట్లు వైభవ్ గతంలో వెల్లడించాడు. తొలుత 12వ నంబర్ తీసుకోవాలని భావించగా, 1+2=3 కాబట్టి నేరుగా 3వ నంబర్‌నే ఎంచుకోవాలని ఆమె సూచించిందట. ఆ తర్వాత ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ సాధించడంతో పాటు భారత జట్టులో చోటు దక్కడం ఈ నంబర్‌పై అతడి నమ్మకాన్ని మరింత పెంచింది. మొదటి ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులకే ఔటైనా, రెండో ఇన్నింగ్స్‌లో వైభవ్ భారీగా రాణిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.