HomeWarangal Newsవానకొండయ్య గుట్ట మైనింగ్ ఆపాలి.. లేదంటే ఉద్యమం తీవ్రం చేస్తాం: ఎర్రబెల్లి దయాకర్ రావు

వానకొండయ్య గుట్ట మైనింగ్ ఆపాలి.. లేదంటే ఉద్యమం తీవ్రం చేస్తాం: ఎర్రబెల్లి దయాకర్ రావు

spot_img

జనగామ జిల్లా | దేవరుప్పుల మండలం

దేవరుప్పుల మండల కేంద్రంలోని లకవత్ తండలో ఉన్న వానకొండయ్య గుట్ట మైనింగ్ పర్మిషన్‌ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు బీఆర్ఎస్ నాయకులతో కలిసి జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారికి మెమోరాండం అందజేశారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ…

మైనింగ్ మాఫియాకు అండగా నిలుస్తూ భక్తుల మనోభావాలతో ఆటలాడుతున్న ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రద్దైన మైనింగ్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అనుమతులు ఇవ్వడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

వానకొండయ్య గుట్టపై ఒక్క రాయి కదిలినా బీఆర్ఎస్ ఉద్యమం అగ్నిజ్వాలలా మారుతుందని స్పష్టం చేశారు.

గుట్టను కాపాడుతామని… మైనింగ్‌ను అడ్డుకుంటామని… ప్రజల తరఫున చివరి వరకు పోరాడుతామని తెలిపారు.

బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ గారితో మాట్లాడి మైనింగ్ పర్మిషన్ రద్దు చేయించామని, దేవస్థానం అభివృద్ధికి రూ.2 కోట్లతో పనులు చేపట్టామని గుర్తు చేశారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల మళ్లీ మైనింగ్ పనులు ప్రారంభమయ్యాయని మండిపడ్డారు.

గుట్ట వద్ద పనులను అడ్డుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేసి, నోటీసులు పంపిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

మైనింగ్ పనులు ఆపకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

మాదాపురం గ్రామ ఎస్సీ కాలనీలో 30 డబుల్ బెడ్ రూం ఇండ్ల మూడో విడత బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

FAQ’s

Q1. వానకొండయ్య గుట్ట ఎక్కడ ఉంది?
దేవరుప్పుల మండల కేంద్రంలోని లకవత్ తండ సమీపంలో వానకొండయ్య గుట్ట ఉంది.

Q2. మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలని ఎవరు డిమాండ్ చేశారు?
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Q3. ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమన్నారు?
గుట్టపై ఒక్క రాయి కదిలినా బీఆర్ఎస్ ఉద్యమం తీవ్ర స్థాయిలో కొనసాగుతుందని హెచ్చరించారు.

Q4. జనగామ కలెక్టర్‌కు ఏమి అందజేశారు?
మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలని కోరుతూ మెమోరాండం అందజేశారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

పిల్లలకు ఫోన్ అలవాటు మాన్పించాలా? తల్లిదండ్రులు ఇలా చేయండి!

పిల్లలకు ఫోన్ అలవాటు ఎక్కువైందా? స్క్రీన్ టైమ్‌ను క్రమంగా తగ్గించడంతో పాటు ప్రత్యామ్నాయంగా ఆటలు, పుస్తకాలు, కుటుంబంతో గడిపే సమయాన్ని పెంచేందుకు తల్లిదండ్రులు పాటించాల్సిన సింపుల్ టిప్స్ ఇవే.

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.
spot_img

Related Articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...