మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లికి చెందిన వేం నరేందర్ రెడ్డి గురువారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో ఆయన తన పదవీ బాధ్యతలను స్వీకరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన నరేందర్ రెడ్డి, తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఈ పదవితో ఒక కీలక మైలురాయిని చేరుకున్నారు.
ఆయన నియామకం పట్ల జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నాయి.


