HomeWarangal Newsవరంగల్ సైబర్ పోలీస్ స్టేషన్ డీఎస్పీగా వెంకటరమణ బాధ్యతలు

వరంగల్ సైబర్ పోలీస్ స్టేషన్ డీఎస్పీగా వెంకటరమణ బాధ్యతలు

Published on

spot_img

వరంగల్ సైబర్ పోలీస్ స్టేషన్ డీఎస్పీగా వెంకటరమణ బాధ్యతలు:

వరంగల్ సైబర్ పోలీస్ స్టేషన్ కు నూతన డిఎస్పీగా నియమితులైన ఎం. వెంకటరమణ బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి బాధ్యతలు స్వీకరణ పై చర్చించారు.

ఈ సమావేశంలో కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. “సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు వేగంగా స్పందించాలని సూచించారు. బాధితులకు తక్షణమే సహాయం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు కేసుల దర్యాప్తును సమర్ధవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రజల్లో సైబర్ భద్రతపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని కమిషనర్ పేర్కొన్నారు”.

ఆన్లైన్ మోసాలు, ఫేక్ లింకులు, బ్యాంకింగ్ మోసాలు, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాలను ఘననీయంగా తగ్గించవచ్చు అని ఆయన అన్నారు. కాగా, ఇంతకుముందు వరంగల్ సైబర్ క్రైమ్ డీఎస్పీగా పనిచేసిన కె. గిరికుమార్‌ను మహబూబ్‌నగర్ సైబర్ క్రైమ్ డీఎస్పీగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ సైబర్ నేరాల నియంత్రణ, ఫిర్యాదుల పరిష్కారంలో సమర్థవంతంగా పనిచేస్తారని పోలీసు వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Latest articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...

కేంద్ర పథకాలు వేగంగా అమలు చేయాలి: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని, అర్హులైన లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధికారులను ఆదేశించారు.
spot_img

Related Articles