హనుమకొండ: వర్షాకాలం దృష్ట్యా విద్యుత్ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు ఎన్పీడీసీఎల్ (NPDCL) విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. విద్యుత్ చోరీల నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని, క్షేత్రస్థాయిలో తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఎస్. కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యుత్ సరఫరాకు సంబంధించి వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులపై సిబ్బంది తక్షణమే స్పందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బి. పురుషోత్తం, బి. భాస్కర్, కె. కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


