వరంగల్ జిల్లాలోని ఖిల్లా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఇక్కడ ఇన్-ఛార్జ్‌గా పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్ వెంకట్ లాల్‌ను, డీఎస్పీ మల్లయ్య ఆధ్వర్యంలోని బృందం సుదీర్ఘంగా విచారించింది. సబ్ రిజిస్ట్రార్‌పై ఇటీవల కాలంలో అనేక ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ సోదాలు చేపట్టారు.
కార్యాలయం తలుపులు మూసివేసి లోపల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికారుల రాకతో కార్యాలయ పరిసరాల్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్లు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.


