HomeWarangal Newsపేదల జోలికి రావొద్దు.. అభివృద్ధి పేరుతో అన్యాయం సహించం: వినయ్ భాస్కర్

పేదల జోలికి రావొద్దు.. అభివృద్ధి పేరుతో అన్యాయం సహించం: వినయ్ భాస్కర్

Published on

spot_img

పేదల జోలికి రావొద్దు.. అభివృద్ధి పేరుతో అన్యాయం సహించం: వినయ్ భాస్కర్

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో రైల్వే రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని, అయితే ఏ వర్గానికీ నష్టం కలగకుండా జరిగే అభివృద్ధినే స్వాగతిస్తామని స్పష్టం చేశారు.

తాను ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలు బాగా తెలుసని పేర్కొన్నారు. రైల్వే రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్‌కు కార్యాలయ స్థలం కల్పించేందుకు గతంలో కడియం శ్రీహరితో కలిసి హామీ ఇచ్చామని, ఆ దిశగా తన వంతు కృషి చేశానని తెలిపారు. వివిధ సంఘాలు, అసోసియేషన్లకు కార్యాలయాల ఏర్పాటు కోసం కూడా నిరంతరం పనిచేశానని చెప్పారు.

వైఎస్ఆర్ నగర్ ప్రాంత ప్రజల సమస్యలు తనకు తెలుసని పేర్కొన్న వినయ్ భాస్కర్, పేదలకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడి పోరాడుతానని హామీ ఇచ్చారు. తన రాజకీయ జీవితంలో ఏ ఒక్క గుడిసెను కూల్చలేదని, పేద ప్రజల జోలికి ఎవరినీ రానివ్వలేదని అన్నారు. భద్రకాళి ఆలయ మాడ వీధుల అభివృద్ధి కోసం గతంలో ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చామని, అయితే చెరబండ రాజు కాలనీ వాసుల ఇళ్లను తొలగించాలని తాను ఎప్పుడూ కోరలేదని స్పష్టం చేశారు.

చిత్తశుద్ధి ఉంటే స్థానిక నిరుపేదలకు సమీప ప్రభుత్వ భూమిలో పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అభివృద్ధి పేరుతో పేదలకు అన్యాయం జరిగితే సహించబోమని, అవసరమైతే న్యాయపరంగా కూడా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించిన ఆయన, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. పేదలు, బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

AI 80’s ఫోటో ట్రెండ్‌పై నిపుణుల హెచ్చరిక.. ఫోటోలు అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్త!

AI టూల్స్‌తో 1980ల నాటి ఫోటోల తరహాలో చిత్రాలను మార్చుకునే ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వ్యక్తిగత ఫోటోలను AI ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ, డేటా భద్రతపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బిగ్ బాస్ హోస్టుల రెమ్యునరేషన్.. ఒక్కో సీజన్‌కు కోట్లలో పారితోషికం!

బిగ్ బాస్ షోకు హోస్టులుగా వ్యవహరించిన ప్రముఖ నటులు, సెలబ్రిటీలకు భారీగా పారితోషికం అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో సీజన్‌కు ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసుకోవాలంటే ఈ వివరాలు చూడాల్సిందే.

అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి ప్రశంసలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) సామాజిక బాధ్యతలో భాగంగా కీలక కార్యక్రమం చేపట్టింది. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది బాలికలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

నిద్రలో పదేపదే మేల్కొంటున్నారా? మీ శరీరం చెప్తుందే ఇదే..!

రాత్రిపూట నిద్రలో పదేపదే మెలకువ రావడానికి ఒత్తిడి, ఆందోళన, కెఫిన్, గది వాతావరణం వంటి కారణాలు ఉండొచ్చు. అయితే గురకతో పాటు శ్వాస ఆగడం, పగటిపూట అధిక నిద్రమత్తు ఉంటే స్లీప్ అప్నియా సంకేతాలు కావచ్చు.
spot_img

Related Articles

వరంగల్‌లో మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం

మాజీ మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చొరవతో ప్రమాదకర గుంతల పూడ్చివేత..

నగర పరిధిలోని ఫాతిమా బ్రిడ్జి, అదాలత్ సెంటర్ ప్రధాన రహదారులపై వాహనదారులకు నరకం చూపుతున్న ప్రమాదకర గుంతలను ట్రాఫిక్ సీఐ వెంకన్న తన సొంత చొరవతో పూడ్చివేయించారు.

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో సడన్‌గా చెలరేగిన మంటలు: సకాలంలో స్పందించి పెను ప్రమాదాన్ని తప్పించిన డెలివరీ బాయ్స్

విద్యుత్‌నగర్‌లోని రోడ్‌ నంబర్‌ 1 సమీపంలో ఒక భారీ ప్రమాదం తృప్తిలో తప్పింది. గురువారం రోజున అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.