వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నగర డిప్యూటీ మేయర్ పాలన ముగిసిన సందర్భంగా 36వ డివిజన్ పరిధిలోని చింతల్ బ్రిడ్జి వద్ద ఉన్న వార్డ్ ఆఫీస్ దగ్గర స్థానిక ప్రజలు, నాయకులు వినూత్నంగా సంబరాలు జరుపుకున్నారు.
డిప్యూటీ మేయర్ పదవీ కాలం ముగియడాన్ని పురస్కరించుకుని, డివిజన్ వార్డ్ ఆఫీస్‌ను పాలతో శుద్ధి చేసిన స్థానికులు, అనంతరం గుమ్మడికాయతో దిష్టి తీసి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. కార్యాలయం ముందు భారీగా టపాకాయలు పేల్చి సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో సామాజికవేత్త, సుశ్మిత గార్డెన్ యజమాని మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ పాల్గొని ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డివిజన్ ప్రజలు ఈ మార్పు పట్ల ఎంతో ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు.


