వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు పర్యావరణ అనుమతులు పొందేందుకు కన్సల్టెంట్ నియామకానికి ఈ-టెండర్ నోటీసు విడుదలైంది.
“వరంగల్, తెలంగాణలో ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి” పనుల భాగంగా పర్యావరణ క్లియరెన్స్ పొందేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయడం, అనుమతుల ప్రక్రియను పూర్తి చేయడం కోసం కన్సల్టెంట్‌ను ఎంపిక చేయనున్నారు.
ఈ పనులకు సుమారు రూ.20 లక్షల వ్యయాన్ని అంచనా వేశారు. పర్యావరణ అనుమతులు పొందేందుకు 6 నెలల గడువు ఉండగా, అనంతరం అవసరమైన నిబంధనల అమలుకు మరో 3 సంవత్సరాల కాలపరిమితి నిర్ణయించారు.
ఈ టెండర్ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ CPP పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించబడనుంది.


