వరంగల్ భద్రకాళి బండ్లో కొత్త సౌకర్యం.. బ్యాటరీ వెహికల్ సేవలు షురూ:
వరంగల్: భద్రకాళి బండ్‌ను సందర్శించే ప్రజల సౌకర్యార్థం బ్యాటరీ వెహికల్ సేవలు మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఈ సేవలను ప్రారంభించారు.
ప్రజలకు అందుబాటులో బ్యాటరీ వెహికల్:
బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్‌ను ప్రారంభించిన అనంతరం కుడా సీపీఓ అజిత్ రెడ్డి వాహనాన్ని నడిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్నతో పాటు పలువురు అధికారులు బ్యాటరీ వెహికల్లో భద్రకాళి బండ్‌పై ప్రయాణించారు.
కెనరా బ్యాంకు సహకారం:
కెనరా బ్యాంకు తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులతో కొనుగోలు చేసిన ఈ బ్యాటరీ వెహికల్‌ను కుడాకు అందజేసింది. ప్రజలు, పర్యాటకులు బండ్ పరిసరాలను సులభంగా సందర్శించేందుకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి.
సందర్శకులకు మెరుగైన వసతులు:
భద్రకాళి బండ్‌కు వచ్చే సందర్శకుల రాకపోకలను సులభతరం చేయడంతో పాటు వృద్ధులు, పిల్లలకు ఈ వాహనం మరింత అనుకూలంగా ఉండనుంది. కార్యక్రమంలో కుడా ఈఈ భీమ్రావు, కెనరా బ్యాంకు అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


