వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ భద్రకాళి దేవస్థానంలో జరగనున్న శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ ఉత్సవాలకు సంబంధించిన వివరాలను ఆలయ కార్యనిర్వహణాధికారి (EO) రామాల సునీత మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ నెల 19వ తేదీ నుండి 30వ తేదీ వరకు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆలయ అధికారులు, అర్చకులు కలిసి ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
ఓరుగల్లు ఇలవేల్పుగా కొలిచే భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 12 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, వాహన సేవలు నిర్వహించనున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శేషు, ఆలయ ధర్మకర్తలు, సిబ్బంది మరియు ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.


