వరంగల్ జిల్లా: బాన్సువాడలో హిందువులపై జరిగిన రాళ్లదాడి ఘటనకు నిరసనగా, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అక్రమ అరెస్ట్‌కు వ్యతిరేకంగా వరంగల్‌లో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు.
వరంగల్ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను అండర్ బ్రిడ్జి వద్ద దహనం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని నాయకులు ఆరోపించారు.
ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవి నాయకత్వం వహించారు. జిల్లా స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నిరసన సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బాన్సువాడ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాంచందర్ రావు అరెస్టును ఖండిస్తూ, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.


