HomeWarangal Newsవరంగల్‌లో CGHS వెల్‌నెస్ సెంటర్ మంజూరు: ఎంపీ డా. కడియం కావ్య కృషికి ఫలితం

వరంగల్‌లో CGHS వెల్‌నెస్ సెంటర్ మంజూరు: ఎంపీ డా. కడియం కావ్య కృషికి ఫలితం

Published on

spot_img

వరంగల్ నగర ప్రజలకు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు గొప్ప ఊపిరి పోసిన వార్త వచ్చింది.

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న CGHS వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ విజయం వెనుక వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఏడాదిన్నర కాలంగా చేసిన నిరంతర కృషి, సంప్రదింపులు కీలక పాత్ర పోషించాయి.

వరంగల్‌లోని ఆకాశవాణి క్వార్టర్స్‌లో ఈ కొత్త వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు కానుంది. డాక్టర్ కావ్య స్వయంగా నాలుగు అనువైన ప్రభుత్వ భవనాలను పరిశీలించి, అధికారులతో చర్చలు జరిపారు.

చివరికి ఆకాశవాణి పరిధిలోని సిబ్బంది క్వార్టర్స్‌ను ఎంచుకున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో నిరంతర సంప్రదింపుల ద్వారా ఈ అనుమతి సాధించారు.

ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, “దేశవ్యాప్తంగా సుమారు 22 కేంద్రాలకు వెల్‌నెస్ సెంటర్లు మంజూరైనప్పటికీ, వరంగల్ జిల్లాకు పూర్తి అనుమతులు లభించడం గర్వకారణం. ఈ సెంటర్‌ను నా ఎంపీ నిధులతో కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసి, అత్యుత్తమ సౌకర్యాలతో తీర్చిదిద్దుతాను” అని స్పష్టం చేశారు.

వరంగల్ పరిధిలోని 54 ప్రధాన పట్టణాల్లో నివసిస్తున్న 15 వేల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఈ వెల్‌నెస్ సెంటర్ ద్వారా ప్రాథమిక వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ, ఆరోగ్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి వస్తాయి.

ఇప్పటి వరకు హైదరాబాద్ లేదా ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బంది తొలగుతుంది.

తన విన్నపాలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే, వెల్‌నెస్ సెంటర్ సేవలు త్వరగా ప్రారంభించేందుకు CGHS డైరెక్టర్ కు త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ పరిణామంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దశాబ్దాల పాటు పెండింగ్‌లో ఉన్న ఈ దీర్ఘకాలిక సమస్యకు ఎంపీ డాక్టర్ కడియం కావ్య చొరవతో పరిష్కారం లభించడం పట్ల వారు ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఈ విజయం వరంగల్ ప్రజల ఆరోగ్య సంక్షేమంలో కీలక మలుపుగా నిలుస్తుంది.

Latest articles

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...
spot_img

Related Articles