ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి నుంచి చికెన్ షాపులు నిరవధికంగా బంద్ అయ్యాయి. ఫౌల్ట్రీ కంపెనీలు తమకు ఇస్తున్న మార్జిన్‌ను తగ్గించడంపై చికెన్ షాప్ యజమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
చికెన్ విక్రయాలపై సరైన మార్జిన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తగ్గించిన మార్జిన్‌ను వెంటనే పెంచేవరకు బంద్ కొనసాగుతుందని ప్రకటించారు.
ఫౌల్ట్రీ కంపెనీలు తమ నిర్ణయాన్ని మార్చి, వ్యాపారులకు అనుకూలంగా మారే వరకు ఈ బంద్ కొనసాగుతుందని ఉమ్మడి వరంగల్ జిల్లా చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.


