యువ షూటర్ సంగేమ్ తనిసికి సీపీ అభినందనలు:
హనుమకొండ జిల్లా కమలాపూర్ ప్రాంతానికి చెందిన యువ షూటర్ సంగేమ్ తనిసి క్రీడారంగంలో ప్రతిభ కనబరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఇటీవల పదో తరగతి పూర్తి చేసిన ఆమె షూటింగ్ క్రీడల్లో మరింత నైపుణ్యం సాధించేందుకు నూతన స్పోర్ట్స్ గన్నును కొనుగోలు చేసింది.
స్పోర్ట్స్ గన్ వినియోగానికి పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరి కావడంతో సంబంధిత అధికారులతో కలిసి సోమవారం పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ యువ షూటర్ తనిసితో స్నేహపూర్వకంగా మాట్లాడారు.
షూటింగ్ క్రీడ పై ఆమెకు ఉన్న ఆసక్తి ఇప్పటివరకు సాధించిన విజయాలు భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్నవయసులోనే క్రీడారంగంలో క్రమశిక్షణతో ముందుకు సాగుతూ ప్రతిభ చాటుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.
క్రీడల ద్వారా యువతలో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, క్రమశిక్షణ పెరుగుతాయని సీపీ తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర జాతియ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి కమలాపూర్ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు . కుటుంబ సభ్యులు, కోచ్ ల సహకారంతో మరింత కష్టపడి ఉన్న స్థాయికి చేరుకోవాలని సూచించారు. అనంతరం యువ షూటర్ సంఘం అభినందిస్తూ ఆమె భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


