హనుమకొండ బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రం ప్రత్యేక విద్యార్థులు ఏర్పాటు చేసిన హ్యాండ్‌మేడ్ వస్తువుల స్టాల్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ సందర్శించారు. విద్యార్థులు స్వయంగా తయారుచేసిన వస్తువులను కొనుగోలు చేసి, వారి సృజనాత్మకతను, నైపుణ్యాలను అభినందించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సీపీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు రాయల ప్రభాకర్ రావు, సురేష్, పోలీస్ అధికారులు, మల్లికాంబ మనోవికాస కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.


