వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదోన్నతి పొందిన అధికారులు మరింత బాధ్యతతో వ్యవహరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు.
ఏఎస్సైల నుండి సబ్ ఇన్‌స్పెక్టర్‌లుగా (SI) పదోన్నతి పొందిన 25 మంది అధికారులు శుక్రవారం సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అధికారుల భుజాలపై సీపీ స్వయంగా స్టార్స్ (నక్షత్ర చిహ్నాలు) అలంకరించి వారిని అభినందించారు.

పదోన్నతి అనేది కేవలం హోదా మాత్రమే కాదని, ప్రజల పట్ల బాధ్యతను పెంచుతుందని సీపీ గుర్తుచేశారు. బాధితుల సమస్యలను సానుభూతితో వింటూ, వేగవంతమైన పరిష్కారాలు చూపాలని ఆదేశించారు.
విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ మరియు నిబద్ధతతో పనిచేస్తూ కమిషనరేట్ ప్రతిష్టను పెంచాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి అధికారి కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు.


