టెక్నీకల్ డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వరంగల్ సీపీ, పోలీసు అధికారులు:
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి చేపడుతున్న చర్యల్లో భాగంగా, తెలంగాణ రాష్ట్ర టెక్నీకల్ డీజీపీ వి.వి. శ్రీనివాస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‌తో పాటు కమిషనరేట్‌కు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్ నుంచి నిర్వహించిన ఈ వీడియో సమావేశంలో పోలీసు శాఖలో వినియోగిస్తున్న ఆధునిక డిజిటల్ అప్లికేషన్లు, సాంకేతిక వ్యవస్థలకు సంబంధించిన తాజా అప్‌డేట్లపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా పోలీసు దర్యాప్తు, కేసుల నిర్వహణ, డిజిటల్ ఆధారాల సేకరణ మరియు విశ్లేషణలో ఉపయోగపడే ‘సాక్ష్య’తో పాటు ఇతర సాంకేతిక అప్లికేషన్లలో ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ల గురించి అధికారులకు వివరించారు.
టెక్నీకల్ విభాగానికి చెందిన నిపుణులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ అప్‌డేట్ల వల్ల కలిగే ప్రయోజనాలు, వాటి వినియోగ విధానం, పోలీసు విధుల్లో వాటి ప్రాధాన్యతను వివరంగా తెలియజేశారు. పోలీసు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవడం, కొత్త అప్‌డేట్లను రోజువారీ విధుల్లో అమలు చేయడం అవసరమని అధికారులు సూచించారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


