HomeLatest Newsబాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్

బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్

Published on

spot_img

చిల్పూర్ : బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి వారికి న్యాయం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం వెస్ట్ జోన్ పరిధిలోని చిల్పూర్ పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించి, స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

​ముందుగా స్టేషన్‌కు చేరుకున్న సీపీకి పోలీస్ అధికారులు మొక్కలు అందజేసి సాదర స్వాగతం పలికారు. స్టేషన్ రిసెప్షన్, ఐటీ విభాగం, మరియు ఇతర విభాగాల సిబ్బంది పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు.

స్టేషన్ నిర్వహణ రికార్డులు, రౌడీ షీటర్లు, అనుమానితుల వివరాలు మరియు పెండింగ్‌లో ఉన్న కేసుల ఫైళ్లను సీపీ స్వయంగా తనిఖీ చేశారు. స్టేషన్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సూచనలు చేశారు.

ప్రతి కానిస్టేబుల్ గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకం కావాలని, క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవాలని సూచించారు.

​ రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అక్రమ ఇసుక రవాణా మరియు పాఠశాలల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

​ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ భీం శర్మ, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బుగులు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సీపీ

​పోలీస్ స్టేషన్ తనిఖీ అనంతరం సీపీ సన్‌ప్రీత్ సింగ్ చిల్పూర్‌లోని ప్రసిద్ధ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు సీపీకి ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలు, స్వామివారి శేష వస్త్రాలను అందజేశారు. ఆలయ విశిష్టతను మరియు అక్కడ జరిగే ఉత్సవాల వివరాలను అర్చకులు సీపీకి వివరించారు.

Latest articles

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి
spot_img

Related Articles

నవోదయ సీటు మీ లక్ష్యమా? ప్రిపరేషన్ ఇలా ఉంటే సక్సెస్ పక్కా!

నవోదయ ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు సాధించాలంటే ముందుగా సిలబస్, పరీక్ష విధానాన్ని అర్థం చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదవాలి. రోజువారీ ప్రాక్టీస్, మాక్ టెస్టులు, టైమ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెడితే పరీక్షకు మెరుగ్గా సిద్ధం కావచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.