HomeWarangal Newsపోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగించాలి: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్

పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగించాలి: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్

Published on

spot_img

వరంగల్: బాధితులు పోలీసుల వద్దకు వస్తే తమకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే బలమైన నమ్మకాన్ని ప్రజల్లో పెంపొందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు.

​శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్‌స్పెక్టర్ల స్థాయి నుండి ఏసీపీ (ACP) లుగా పదోన్నతి పొందిన అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పదోన్నతి పొందిన గొర్ల సీతారెడ్డి, బోలగాని శ్రీనివాస్ గౌడ్, సార్ల రాజులు సీపీ క్యాంపు కార్యాలయంలో కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ​ఈ సందర్భంగా కమిషనర్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

​పదోన్నతులతో పాటు క్షేత్రస్థాయిలో బాధ్యతలు కూడా పెరుగుతాయని, వాటిని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. నిరంతరం క్షేత్రస్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షిస్తూ, వారికి సరైన దిశానిర్దేశం చేయాలని ఆదేశించారు.

పోలీస్ శాఖ యొక్క ప్రతిష్టను, గౌరవ మర్యాదలను మరింత పెంపొందించేలా ప్రతి అధికారి తమ విధులను అత్యంత పారదర్శకంగా నిర్వర్తించాలని కోరారు. ప్రజలకు చేరువవుతూ, వారి సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సిపి స్పష్టం చేశారు.

​ఈ కార్యక్రమంలో పదోన్నతి పొందిన అధికారులు సీపీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

Latest articles

పిల్లలకు ఫోన్ అలవాటు మాన్పించాలా? తల్లిదండ్రులు ఇలా చేయండి!

పిల్లలకు ఫోన్ అలవాటు ఎక్కువైందా? స్క్రీన్ టైమ్‌ను క్రమంగా తగ్గించడంతో పాటు ప్రత్యామ్నాయంగా ఆటలు, పుస్తకాలు, కుటుంబంతో గడిపే సమయాన్ని పెంచేందుకు తల్లిదండ్రులు పాటించాల్సిన సింపుల్ టిప్స్ ఇవే.

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.
spot_img

Related Articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...