HomeWarangal Newsధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్

ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్

Published on

spot_img

వరంగల్: పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల్లో న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించే విధంగా పోలీసులు పని చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. గురువారం ఆయన ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు ధర్మసాగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రావు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించి, స్టేషన్ పరిధిలోని గ్రామాలు, ప్రజల జీవనశైలి, ఎక్కువగా నమోదయ్యే నేరాలు, రౌడీ షీటర్లు, అనుమానితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అలాగే పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరు, బీట్ వ్యవస్థ, పెట్రోలింగ్, రికార్డుల నిర్వహణపై కూడా ఇన్‌స్పెక్టర్‌ను ప్రశ్నించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులకు సంబంధించిన రికార్డులను కమిషనర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై అధికారులు మరియు సిబ్బంది తక్షణమే స్పందించాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం లేకుండా పనిచేయాలని, పారదర్శకంగా విధులు నిర్వహిస్తూ ప్రజల అభిమానాన్ని పొందాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ఎస్‌ఐలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles