వరంగల్ (కమిషనరేట్): వరంగల్ పోలీస్ శాఖలో కలకలం రేపిన ఘటనలో కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకే కేసులో ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేయడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.. ఒకే కేసులో ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI), ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ (SI)లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది.
అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో చర్యలు
వరంగల్ కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధిలోని నర్మెట్ట సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ (CI) యం. అబ్బయ్య, అలాగే గతంలో బచ్చన్నపేట సబ్ ఇన్‌స్పెక్టర్ (SI)గా పనిచేసి ప్రస్తుతం ఏఆర్ (AR) అటాచ్‌మెంట్‌లో ఉన్న ఎస్.ఐ షేక్ హమీద్‌లపై వచ్చిన అవినీతి ఆరోపణలపై శాఖాపరమైన విచారణ జరిగింది. ఈ విచారణలో వారిపై వచ్చిన ఆరోపణలు నిజమని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వారిని సస్పెండ్ చేస్తూ తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు.
విధుల్లో నిర్లక్ష్యం, అవినీతిపై సీపీ సీరియస్
శాంతిభద్రతల పరిరక్షణలో మరియు విధి నిర్వహణలో అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పోలీస్ కమిషనర్ ఈ చర్య ద్వారా స్పష్టం చేశారు. ఒకే కేసులో సీఐ, ఎస్‌ఐ ఇద్దరూ ఒకేసారి సస్పెన్షన్‌కు గురికావడం స్థానిక పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Warangal News and Latest Politics News and Real Estate

