వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు పోలీస్ అధికారులు, సిబ్బంది అందించిన సహకారం మరువలేనిదని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కొనియాడారు. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆయన పోలీస్ అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో తన పదవీకాలాన్ని ముగించుకుంటున్న సీపీ సన్‌ప్రీత్ సింగ్, అధికారులు మరియు సిబ్బంది అందించిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, వరంగల్ కమిషనరేట్‌లో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు అన్ని రకాల నేరాల నియంత్రణలో సిబ్బంది అంతా ఒకరికొకరు సమన్వయంతో పనిచేయడం పోలీసుల ప్రత్యేకత అని ప్రశంసించారు. తన పదవీ కాలంలో అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి తనకు పూర్తి స్థాయిలో సహకరించారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate

