HomeWarangal Newsవరంగల్‌ అభివృద్ధికి కేంద్రం నిధులు: లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య ప్రశ్నలకు కేంద్ర సమాధానం

వరంగల్‌ అభివృద్ధికి కేంద్రం నిధులు: లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య ప్రశ్నలకు కేంద్ర సమాధానం

Published on

spot_img

వరంగల్ జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ మరియు పారిశ్రామిక ప్రగతిపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు.

పీఎం గతిశక్తి, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్, ఇతర కేంద్ర పథకాల కింద వరంగల్‌కు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక ఉందా? ఉంటే ఏయే ప్రాజెక్టులు మంజూరయ్యాయి, వాటి ద్వారా జిల్లాకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరాలు వెల్లడించాలని ఆమె కోరారు.

రూ. 15,600 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు

ఎంపీ ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. వరంగల్ జిల్లాలో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని మెరుగుపరచడానికి చేపడుతున్న పలు ప్రాజెక్టుల వివరాలను వెల్లడించింది.

₹7,843 కోట్ల బడ్జెట్‌తో 447 కిలోమీటర్ల మేర 3 ముఖ్యమైన రైల్వే లైన్లకు ఆమోదముద్ర పడింది.

దాదాపుగా ₹6,133 కోట్ల వ్యయంతో 185 కిలోమీటర్ల మేర 4 జాతీయ రహదారి ప్రాజెక్టులను మంజూరు చేశారు.

‘పీఎం మిత్ర’ పథకం కింద 1,327 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న బ్రౌన్‌ఫీల్డ్ టెక్స్‌టైల్ పార్క్‌కు రూ. 1,696 కోట్లు కేటాయించినట్లు కేంద్రం స్పష్టం చేసింది.

ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా చూస్తాం: ఎంపీ కడియం కావ్య

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై ఎంపీ కడియం కావ్య స్పందిస్తూ.. వరంగల్ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు, నిధుల కేటాయింపులపై స్పష్టత పొందినట్లు తెలిపారు.

“రైల్వే, రహదారులు, టెక్స్‌టైల్ పార్క్ వంటి ప్రాజెక్టులు పూర్తయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పారిశ్రామిక వృద్ధి పెరగడమే కాకుండా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కేంద్రం ప్రకటించిన ఈ అభివృద్ధి పనులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, వేగంగా పూర్తయ్యేలా ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తాం.”— డా. కడియం కావ్య, వరంగల్ ఎంపీ.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles