వరంగల్: దేవాదాయ శాఖ పరిధిలోని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వరంగల్ జిల్లా దేవాదాయ, ధర్మదాయ శాఖ కార్యాలయం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18వ తేదీ నుండి ప్రతి సోమవారం ప్రత్యేకంగా ‘ధర్మవాణి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునిత ఒక ప్రకటనలో తెలిపారు.
అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు, భక్తులు, అర్చకులు, అలాగే దేవాదాయ శాఖ ఉద్యోగులు తమకు ఎదురవుతున్న సమస్యలను, ఫిర్యాదులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లవచ్చు.
అర్చకులు, భక్తులు, ఉద్యోగుల సమస్యలను నేరుగా విని, త్వరితగతిన పరిష్కరించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అధికారులను నేరుగా కలిసి తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చని అసిస్టెంట్ కమిషనర్ పేర్కొన్నారు.


