వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ నోట్లను ముద్రిస్తూ చలామణి చేస్తున్న ఒక ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
నర్సంపేట పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 8 మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 1.48 లక్షల నకిలీ నగదుతో పాటు 3 ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు,రెండు కార్లు మరియు 13 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ అధికారికంగా వెల్లడించారు.
నకిలీ నోట్లను ముద్రిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఈ ముఠాను పట్టుకోవడం ద్వారా పోలీసులు పెద్ద నేరాన్ని అరికట్టారు.


