HomeWarangal Newsవరంగల్‌లో సినీ, ఫ్యాషన్ శిక్షణకు కొత్త వేదిక.. అకాడమీ ప్రారంభం!

వరంగల్‌లో సినీ, ఫ్యాషన్ శిక్షణకు కొత్త వేదిక.. అకాడమీ ప్రారంభం!

Published on

spot_img

వరంగల్‌ నగరంలో తొలిసారిగా ఫిలిం, ఫ్యాషన్ అండ్ డిజైన్ అకాడమీ ప్రారంభమైంది. హనుమకొండ సుబేదారిలోని ఫారెస్ట్‌ ఆఫీసు ఎదురుగా జీకేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫ్యాషన్ అండ్ ఫిలిం అకాడమీని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ యువజన నాయకుడు విష్ణువర్ధన్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అకాడమీని ప్రారంభించారు.

నిర్వాహకులకు అభినందనలు:

ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్‌లో సినీ, ఫ్యాషన్‌ రంగాలపై ఆసక్తి ఉన్న వారికి శిక్షణ అందించే సంస్థ ప్రారంభం కావడం అభినందనీయమన్నారు. అకాడమీ ఫౌండర్‌ గద్దల రాజేష్‌, కో-ఫౌండర్‌ గొర్రె ఐశ్వర్యకు శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ మరింత అభివృద్ధి చెంది విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

పలు కోర్సులు, సేవలు అందుబాటులో:

అకాడమీ నిర్వాహకులు గద్దల రాజేష్‌, గొర్రె ఐశ్వర్య మాట్లాడుతూ.. వరంగల్‌, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని యువతకు అందుబాటులో ఉండేలా ఫిలిం, ఫ్యాషన్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫ్యాషన్‌ డిజైనింగ్‌, బాడీ అండ్‌ మేకప్‌, మోడ్రన్‌ ఫిలిం క్లాసెస్‌, యాక్టింగ్‌ క్లాసెస్‌, ఫోటోగ్రఫీ వంటి సేవలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.

సినీ రంగంపై ఆసక్తి ఉన్న యువతీ యువకులతో పాటు పిల్లలు, పెద్దలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో గద్దల కేశవరావు (జీఆర్‌కే), గద్దల శాంత, గొర్రె అనిత ప్రసాద్‌, పాల్సన్‌ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles