వరంగల్ నగరంలోని గాంధీనగర్ ప్రాంతంలో సురేష్ అనే వ్యక్తిపై జరిగిన క్రూర దాడి ఘటనపై మిల్స్ కాలనీ పోలీసులు స్పందించారు.
ఈ ఘటనలో నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దాడి జరిగిన ప్రదేశం గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని అధికారులు తెలిపారు.
దాడికి ముందు బాధితుడిని ఎస్ ఆర్ నగర్ నుండి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ ప్రదేశం ఏనుమాముల పోలీస్ పరిధిలోకి వస్తుంది.
ఈ ఘటనపై బాధితుడి సోదరి మిల్స్ కాలనీ పోలీసులను ఆశ్రయించగా, వారు తక్షణమే స్పందించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో మిల్స్ కాలనీ పోలీసుల వేగవంతమైన చర్యలను నగర ప్రజలు ప్రశంసిస్తున్నారు.


