వరంగల్: నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. కేవలం 5 వేల రూపాయల సుపారీ కోసం ఒక వ్యక్తిపై దాడికి తెగబడిన ‘గాంజా గ్యాంగ్’ను పోలీసులు అరెస్ట్ చేశారు.
గాంధీనగర్‌కు చెందిన సురేష్ (38) అనే వ్యక్తిపై కొద్దిరోజుల క్రితం కొందరు దుండగులు తీవ్రస్థాయిలో దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.
మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ శుభం ఈ కేసు వివరాలను వెల్లడించారు:
నిందితులు కేవలం రూ. 5,000 మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుని సురేష్‌పై దాడికి పాల్పడ్డారు. పట్టుబడిన నిందితులకు గంజాయి సేవించే అలవాటు ఉందని, ఆ మత్తులోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు దాడిలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై, ముఖ్యంగా గంజాయి బ్యాచ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ చర్యలనైనా ఉపేక్షించేది లేదని ఏసీపీ శుభం అన్నారు.
ప్రస్తుతం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి, కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.


