కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని చాటిచెప్పిన మహారాజు, రాణి రుద్రమదేవి మనవడు ప్రతాపరుద్రుడి జయంతి వేడుకలను తొలిసారిగా ఓరుగల్లులో ఘనంగా నిర్వహించనున్నారు.
బుధవారం( మార్చి 25) ఉదయం 10 గంటలకు హన్మకొండలోని చారిత్రక వేయి స్తంభాల గుడి ఆవరణలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు చరిత్ర పరిశోధకులు హాజరుకానున్నారు. కాకతీయ వంశపారంపర్య రాజుగా ప్రతాపరుద్రుడు చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ప్రభుత్వం మరియు స్థానిక యంత్రాంగం ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.


