HomeWarangal Newsవరంగల్ కార్పొరేషన్‌లో ‘పోస్టర్ల’ కలకలం: “జస్టిస్ ఫర్ చిలుక భాస్కర్” అంటూ వెలిసిన వాల్ పోస్టర్లు

వరంగల్ కార్పొరేషన్‌లో ‘పోస్టర్ల’ కలకలం: “జస్టిస్ ఫర్ చిలుక భాస్కర్” అంటూ వెలిసిన వాల్ పోస్టర్లు

Published on

spot_img

వరంగల్, మే 16: వరంగల్ మహా నగర పాలక సంస్థ (GWMC) పరిధిలో శనివారం ఉదయం వెలిసిన కొన్ని వివాదాస్పద వాల్ పోస్టర్లు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. “జస్టిస్ ఫర్ చిలుక భాస్కర్” అనే ప్రధాన నినాదంతో ప్రభుత్వ భూముల కబ్జా, అధికారుల అవినీతిని ఎండగడుతూ గుర్తుతెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను అంటించడం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.

ఏనుమాముల పరిధిలో భూకబ్జా?

​ఈ పోస్టర్లలో పేర్కొన్న వివరాల ప్రకారం… ఏనుమాముల పరిధిలోని సర్వే నంబర్ 257 లో ఉన్న విలువైన భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడు చిలుక భాస్కర్‌కు న్యాయం చేయాలంటూ ఈ పోస్టర్ల ద్వారా డిమాండ్ చేశారు.

అధికారుల పేర్లతో సహా పోస్టర్లు..!

​సాధారణంగా వచ్చే ఆరోపణల లాగా కాకుండా, ఈసారి ఏకంగా కార్పొరేషన్ అధికారుల పేర్లను నేరుగా పోస్టర్లలో ప్రస్తావించడం వరంగల్ మున్సిపల్ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. సదరు భూమిని కబ్జా చేయడానికి, అక్రమ నిర్మాణాలకు లేదా కాగితాల సృష్టికి కార్పొరేషన్ అధికారులే వెనక ఉండి సహకరించారంటూ పేర్లతో సహా బహిరంగంగా పోస్టర్లు వేయడం గమనార్హం.

బహిరంగంగా అధికారుల పేర్లు బయటపెడుతూ నగరంలో ఈ తరహా పోస్టర్లు వెలవడంపై అటు మున్సిపల్ శాఖలోనూ, ఇటు పోలీస్ వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles