HomeWarangal Newsవరంగల్‌లో భారీగా హ్యాష్ ఆయిల్ స్వాధీనం: నలుగురు స్మగ్లర్ల అరెస్ట్

వరంగల్‌లో భారీగా హ్యాష్ ఆయిల్ స్వాధీనం: నలుగురు స్మగ్లర్ల అరెస్ట్

Published on

spot_img

వరంగల్: నగరంలో డ్రగ్స్ విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ ఎత్తున హ్యాష్ ఆయిల్ (Hash Oil) తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి దాదాపు రూ. 2.50 కోట్ల విలువైన హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు.

డ్రగ్ కంట్రోల్ టీమ్, క్యాట్ పార్టీ మరియు ఇంతేజార్‌గంజ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ రవాణా వెలుగుచూసింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గంజాయి నూనె (Hash Oil) అక్రమ రవాణా మరియు విక్రయాల ద్వారా యువత భవిష్యత్తును నాశనం చేసే ఇలాంటి ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles