ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ Sun Preet Singh తెలిపారు.
జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సెక్షన్ 163 BNSS (పాత 144 సెక్షన్) అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
📍 మొత్తం పరీక్ష కేంద్రాలు: 94
హన్మకొండ – 52
వరంగల్ – 24
జనగామ – 16
📅 పరీక్ష తేదీలు: 25-02-2026 నుండి 18-03-2026 వరకు
⏰ పరీక్ష సమయం: ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు
పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ తెలిపారు.
🚫 అమల్లో ఉండే నిషేధాలు:
పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదు.
సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు పూర్తిగా నిషేధం.
పరీక్ష కేంద్రాల నుండి 500 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని జిరాక్స్ కేంద్రాలు 25-02-2026 నుండి 18-03-2026 వరకు ప్రతిరోజూ ఉదయం 06:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు మూసివేయాలి.
ఈ ఉత్తర్వులను ఎవరైనా అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు.


