వరంగల్ కాశీబుగ్గలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలు వివాదాస్పదంగా మారాయి.
👉 రాములోరి కల్యాణం సందర్భంగా ఆలయంలో బౌన్సర్లను ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.
👉 పాత కమిటీ, కొత్త కమిటీ మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడింది.
👉 కొత్త కమిటీకి చెందిన వ్యక్తి బౌన్సర్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
👉 “దేవాలయంలో భక్తులకు భద్రత కోసం కాదు, ఇలా బౌన్సర్లు ఎందుకు?” అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
👉 స్వామి వారి పెళ్లి కార్యక్రమానికి బౌన్సర్ల అవసరం ఏంటి అని భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
👉 కోర్టు ఉత్తర్వులను కూడా కమిటీ సభ్యులు పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
📌 ఈ ఘటనపై భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది.


