HomeWarangal Newsతెలంగాణ ఆవిర్భావ వేడుకలతో కళకళలాడిన వరంగల్ ఖుష్‌మహల్..!

తెలంగాణ ఆవిర్భావ వేడుకలతో కళకళలాడిన వరంగల్ ఖుష్‌మహల్..!

Published on

spot_img

తెలంగాణ ఆవిర్భావ వేడుకలతో కళకళలాడిన వరంగల్ ఖుష్‌మహల్ :

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్లోని చారిత్రాత్మక కిలా వరంగల్ కుష్మహల్ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంనికి ముందు మంత్రి కొండా సురేఖ.. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, డీసీపీ అంకిత్ కుమార్ తో కలిసి అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు.

అనంతరం కుష్మహల్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ దినోత్సవ అధికారిక వేడుకల్లో పాల్గొన్న మంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు..జిల్లా ప్రగతిపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఆస్తులు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను పంపిణీ చేశారు. కార్యక్రమం ముగిసిన తరువాత మంత్రి కొండా సురేఖ , జిల్లా కలెక్ట.ర్ డి.ఎఫ్.ఓ, అదనపు కలెక్టర్లతో కలిసి వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్స్ ను పరిశీలించారు. స్టాల్స్‌లో ప్రదర్శించిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు , ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles